న్యూజెర్సీలో భారత సీఈఓ దారుణ హత్య
అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుండగుడు డబ్బు కోసం దారుణానికి పాల్పడ్డారు. 80 కిలోమీటర్లు వెంబడించి మరీ భారత సంతతి వ్యాపారవేత్తను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూజెర్సీలోని ప్లెయిన్స్బోరోలో ఉంటున్న శ్రీరంగ అరవపల్లి ఔరెక్స్ లేబరేటరీస్ పేరుతో ఓ ఫార్మా సంస్థను నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి వరకు ఫిలడెల్ఫియాలోని ఓ క్లబ్లో క్యాసినో ఆడారు. అనంతరం 10 వేల డార్లతో ఇంటికి బయలుదేరారు. ఆయన వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉండడాన్ని గమనించిన ఓ దుండగుడు ఆ సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ వేశాడు. క్యాసినో నుంచి శ్రీరంగను వెంబడిస్తూ వెళ్లాడు. అలా దాదాపు 80 కిలోమీటర్లు వెంబడిరచారు. శ్రీరంగ న్యూజెర్సీలోని ఇంటికి చేరుకుని లోపలికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపాడు. ఆయన వద్ద సొమ్ము తీసుకుని పరారయ్యాడు.













