ఎలాన్ మస్క్ టీంలో.. మరో భారతీయుడికి కీలక బాధ్యతలు
ఇద్దరు భారతీయులను కీలక పదవులు నుంచి తొలగించిన ఎలాన్ మస్క్, మరో భారతీయుడికి కీలక బాధ్యతలు అప్పగించారు. ట్విటర్ ఈసీఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను, లీగల్ హెడ్‌గా ఉన్న విజయ గద్దెను ఆ పదవుల నుంచి ఆయన తొలగించారు. తాజాగా మరో భారతీయుడు, ప్రముఖటెక్ నిపుణుడిగా పేరున్న శ్రీరామ కృష్ణన్ ఆయనకు సలహాలు ఇస్తున్నారు. కొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి ఎలాన్ మస్క్‌కు తాత్కాలికంగా సాయం చేస్తున్నట్లు శ్రీరామ కృష్ణన్ తెలిపారు. ట్విటర్‌ను ముఖ్యమైన సంస్థగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంపై ఇది చాలా ప్రభావం చూపుతుందని భావిస్తున్నాని, అందుకు మస్క్ నే సరైన వ్యక్తి అని కృష్ణన్ పేర్కొన్నారు.













