యూరప్ లో ముగిసిన శ్రీవారి కళ్యాణోత్సవాలు : వెంకట్ మేడపాటి
ప్రపంచ వ్యాప్తంగా హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా యూరప్ దేశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవాలు ముగిశాయి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు 11 నగరాల్లో ఈ కళ్యాణోత్సవాలను నిర్వహించినట్లు ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరిగిన ఈ కల్యాణానినికి టీటీడీ అర్చకులు, వేద పండితులు యూరప్‌కు వెళ్లారు. అక్కడ పలు నగరాల్లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు ఆయా దేశాల రాయబారులు, ప్రవాస భారతీయలు హాజరైనట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీమలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సమిస్తున్నారని ఇదే స్ఫూర్తితో మరిన్ని దేశాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.













