శ్రీలంక ప్రధాని సంచలన ప్రకటన
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. లంక కొత్త ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భగా లంకేయుల నిరసనల మేరకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. శ్రీలంకకు కొత్త ప్రధానిగా మే 12వ తేదీన రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. కాగా లంకకు ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు.













