నాసా-ఐఎస్‌డీసీ కాన్ఫరెన్స్‌లో శ్రీచైతన్య విద్యార్థుల హవా
అమెరికాకు చెందిన నాసా-ఐఎస్‌డీసీ కాన్ఫరెన్స్‌లో శ్రీచైతన్య విద్యార్థుల హవా కొనసాగింది. వాషింగ్టన్లో మే 27 నుంచి 29 వరకు నిర్వహిచిన ఈ కాన్ఫరెన్స్‌లో 27 మంది తమ స్కూల్ విద్యార్థులు పాల్గొని రికార్డు సృస్టించారని శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. నేషనల్ స్పేస్ సొసైటీ ఈ స్పేస్ సెటిల్మెంట్ కాన్ఫరెన్స ప్రతి ఏడాది నిర్వహిస్తుంది. ఈసారి శ్రీచైతన్య స్కూల్ 1,065 ప్రైజ్ విన్నింగ్ స్టూడెంట్స్‌తో 66 ప్రాజెక్టులకు అవార్డులు సాధించి చరిత్ర సృష్టించిందని వెల్లడిరచారు. ఈ టూర్ సందర్భంగా అమెరికా గురించి విజ్ఞానాన్ని సముపార్జించడం, ఆ దేశంలోని సామాజిక, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి గురించి విద్యార్థులు తెలుసుకున్నారని వివరించారు. అద్భుత ఫలితాలు సాధించిన విజేతలకు సీమ అభినందించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 103 మంది హాజరు కాగా వారిలో భారత్ నుంచి 30 మంది పాల్గొన్నారు. ఇందులో 27 మంది శ్రీచైతన్య విదార్థులే ఉన్నారు.













