అదే జరిగితే… కిమ్ పాలన అంతమైనట్లే!
ఉత్తర కొరియా దేశానికి దక్షిణ కొరియా తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్ పాలన అంతమైనట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అణు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా సమీపంలో నిలిపి ఉంచారు. 1980ల తర్వాత ఒక ఎస్ఎస్బీఎన్ ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో దక్షిణ కొరియా రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా ఈ జలాంతర్గామిని కొరియా ద్వీపకల్పానికి తీసుకువచ్చింది. దీనిపై కిమ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందింది. ఈ తీరు అణుదాడికి దారితీయొచ్చని వ్యాఖ్యానించింది. అదే జరిగితే కిమ్ పాలన అంతమవుతుందని దక్షిణ కొరియా హెచ్చరికలు పంపింది.













