ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య కలకలం
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర కొరియాకు చెందిన ఐదు డ్రోన్లు దక్షిణ కొరియా గగనతలంలోకి చొచ్చుకురావడం కలకలం సృష్టించింది. వాటిలో ఒకటి దాదాపుగా సియోల్ ఉత్తర భూగానికి చేరువగా వెళ్లింది. ఉత్తర కొరియా డ్రోన్లు సరిహద్దును దాటి దక్షిణ కొరియాలో ప్రవేశించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. తాజా పరిణామంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా సైన్యం అత్యాధునిక హెలికాప్టర్లతో డ్రోన్లపై దాడి చేసింది. సరిహద్దుల్లో యుద్ధ విమానాలను చక్కర్లు కొట్టించింది. హెచ్చరికలు కాల్పులు కూడా జరిపింది. తమ దేశంలోకి ప్రవేశించిన ఉత్తర కొరియా డ్రోన్లను దక్షిణ కొరియా సైన్యం కూల్చివేసిందా లేదా అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు.













