ఉత్తర కొరియా మా శత్రువే
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతుండడమే కానీ ఏమాత్రం తగ్గడం లేదు. రెండు దేశాల మద్య ఉద్రికత్తలు దశాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తర కొరియా తమ శత్రు దేశమేనని తాజాగా దక్షిణ కొరియా మరొక సారి స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తమ డిఫెన్స్ డాక్యుమెంట్లో పేర్కొంది. ఆరు సంవత్సరాల తరువాత ఉత్తర కొరియాను ఉద్దేశించి శత్రువు అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది. తద్వారా ఉత్తర కొరియాతో రానున్న రోజుల్లో కూడా కఠినంగా వ్యవహరించబోతున్న సంకేతాలను దక్షిణ కొరియా పంపింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.













