ప్రపంచంలోనే ఇదే మొదటిసారి… గత రికార్డులను బద్దలు కొట్టింది

దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర్ సిట్‍హోల్ (37) అనే మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలు (డెక్యూప్లెట్స్) జన్మించినట్లు ప్రకటించింది. ప్రిటోరియా నగరంలో తన భార్యకు సిజేరియన్ (సి-సెక్షన్) ద్వారా ప్రసవం జరిగిందని ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రసుత్తం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేనికి గురయ్యారు. తన భార్య గర్బం దాల్చి 7 నెలల 7 రోజులయ్యిందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని తెలిపాడు. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అవుతుంది. గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం ఖాయం. సిట్‍హోల్ గతంలో కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చానని సిట్‍గోల్ గతంలో వెల్లడించింది.