మమ్మల్ని విలన్లు గా చూస్తే ఎలా?.. 18 దేశాలపై దక్షిణాఫ్రికా మండిపాటు
కొవిడ్‌తో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరు చెప్పి తమ దేశంపై అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా మండిపడింది. ఈ నిర్ణయాన్ని వివేకం లేని చర్యగా విమర్శించింది. కరోనాపై సమాచారం పంచుకోవడంలో మరింత పారదర్శకత కావాలని తెలిపింది. ఈ వేరియంట్ ఎంత ప్రమోదకరమో ఇంకా పూర్తి సమాచారం లేకుండా ఇలా ఆంక్షలను విధించడాన్ని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ఎంజెలీక్యూ కౌట్జీ తప్పుపట్టారు. ఈ సందర్భంగా కౌట్జీ మాట్లాడుతూ వేరియంట్‌ను గుర్తించినందుకు దక్షిణాఫ్రికా ప్రశంసించబడాలి కానీ, దూషించబడకూడదని అన్నారు. నూతన కరోనా వేరియంట్ బి.11.529 (ఒమిక్రాస్) దక్షిణాఫ్రికాలో తొలిసారిగా గుర్తించబడటంతో 18 దేశాలు ఆ దేశానికి విమాన ప్రయాణాలు నిషేధించాయి.













