అమెరికాలో నిలిచిపోయిన వేల విమానాలు .. ఎందుకో తెలుసా?
అమెరికాలో శీతల తుఫాను కారణంగా తదితర దేశాల్లో విమానాల రాకపోకలు వరుసగా మూడో రోజూ స్తంభించాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని, స్వస్థలాకు వచ్చేందుకు పయనమైన వేలమందికి తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. మధ్య అట్లాంటిక్ వైపు కదులుతున్న భీకర శీతల తుఫాను కారణంగా అమెరికాలో సుమారు 1,900, ప్రపంచ వ్యాప్తంగా మరో 3,300 విమానాలు నిలిచిపోయినట్టు ఫ్లైట్ అవేర్ సంస్థ తెలిపింది. మరో 5 వేల విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. శనివారం ఇలాగే మొత్తం 7400, అదివారం మరో 7 వేల విమానాలు నిలిచిపోయాయి. తుఫాను కారణంగా కొలంబియా, వర్జీనియా, మేరిలాండ్ తదితర చోట్ల 10 అంగుళాల మేరకు మంచు కురియవచ్చని అధికారులు అంచనా వేశారు.













