అక్కడి నుంచి భారతీయులను తరలించడం కష్టమే : కేంద్రం
ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. లక్షల మంది నిరాశ్రయులై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నడుమ అక్కడి నుంచి భారత పౌరులను తరలించే పరిస్థితి లేదని, అవకాశం దొరికితే తప్పకుండా బయటకు తీసుకొస్తామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. గాజాలో గతంలో నలుగురు భారతీయులు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్యపై స్పష్టత లేదని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ పోరులో భారతీయులెవరూ మరణించినట్లు సమాచారం లేదని కేరళకు చెందిన ఓ మహిళా కేర్‌టేకర్ గాయపడగా ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలిపారు.













