సింగపూర్ లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ మహిళకు
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ (టీజేపీ) వెల్లడిరచిన వివరాల ప్రకారం 50 గ్రామల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని జులై 26 అగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది.













