ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ట్ పోర్ట్ ఇదే!
సింగపూర్ పాస్ట్ పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా ప్రపంచంలోని 227 దేశాల్లో 192 దేశాల్ని చుట్టి రావొచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ తాజాగా 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానాయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సింగపూర్ ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. రెండో స్ఠానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి.













