టోక్యో ఒలింపిక్స్ కు సెరెనా విలియమ్స్… దూరం

టోక్యో ఒలింపిక్స్ కు యూఎస్ టెన్నిస్ స్టార్, నల్లకలువ సెరెనా విలియమ్స్ దూరమవుతున్నట్లు ప్రకటించింది. గతంలో 2012 లండన్ ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ లో సెరానా స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుని ఛాంపియన్‍గా నిలిచింది. ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ షరపోవాను ఓడించిన సెరెనా స్వర్ణం సాధించింది. లండన్ ఒలింపిక్స్లోలోనే సెరెనా తన సోదరి వీనస్‍తో కలిసి డబుల్స్ లోనూ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో సెరెనా మూడో రౌండులోనే వెనుదిరిగింది. నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ జరగనుంది.
ఈ టోర్నీలో ఆడనున్న సెరెనా మీడియాతో మాట్లాడుతూ యూఎస్ తరపున టోక్యో వెళ్లే క్రీడాకారుల జాబితాలో తన పేరులేదని అందుకే టోక్యో ఒలింపిక్స్ గురించి తను పట్టించుకోవడం లేదని వెల్లడించింది. అయితే ఒలింపిక్స్ కు వెళ్లకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపింది. జులై 23 నుంచి టోక్యో వేదికగా విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెరెనా నిర్ణయం ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. కాగా 39 ఏళ్ల టాప్‍సీడ్ సెరెనా 8వసారి వింబుల్డన్ విజేతగా నిలవాలని భావిస్తుంది.