అమెరికాలో కలకలం.. చైనా రహస్యంగా
అమెరికాలో చైనా రహస్యంగా పోలీసు స్టేషన్ను నడుపుతున్నట్లు బయటపడటం తాజాగా కలకలం స్పష్టించింది. మన్ హటన్ చైనాటౌన్లోని ఓ భవనంలో చైనా ప్రజా భద్రత శాఖ పేరుతో దాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి న్యూయార్క్లో ఇద్దరిని (హెరీ జియాన్వాంగ్, చైనా జిన్పింగ్) అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎఫ్బీఐకి సమాచారం అందినట్లు తెలిసిన వారు పోలీసు స్టేషన్ కార్యాలయాన్ని మూసివేశారని పేర్కొన్నారు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసే చైనీయులను వేధించేందుకు దాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోందన్నారు. చైనా ప్రభుత్వంతో జరిపిన సంభాషణల డేటాను హేరీ, చెన్ తమ ఫోన్ల నుంచి తొలగించినట్లు ఎఫ్బీఐ అధికారులు ఆరోపించారు.













