దానిని రెండు గంట ముందే పసిగట్టొచు.. ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు
ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు భూకంపాల విషయంలో కీలక ముందడుగు వేశారు. భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని వారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని వారు పేర్కొన్నారు. క్వెంటిన్ బ్లెటెరీ, జియాన్ మాథ్యూ అనే పరిశోధకులు టెక్టోనిక్ ప్లేట్ల కదలికలకు సంబంధించిన జీపీఎస్ డాటా ఆధారంగా భూకంపాలను ముందే పసిగట్టొచ్చని పేర్కొన్నారు. 90 భూకంపాలకు సంబంధించి, 48 గంటల ముందుగా సేకరించిన జీపీఎస్ డాటాను వారు విశ్లేషించారు. భూ కదలికల ఆధారంగా భూకంపాన్ని ముందే అంచనా వేయొచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఇందుకు 0.1 మిల్లీమీటర్ పరిధిలో కదలికలను గుర్తించే జీపీఎస్ సెన్సార్లు అవసరమవుతాయని వెల్లడిరచారు. ప్రస్తుతం అలాంటి సెన్సార్లు అందుబాటులో లేవని, వాటిని అభివృద్ధి చేయగలిగితే కీలక పురోగతి సాధించవచ్చని తెలిపారు.













