కారు నడుపుతామన్నందుకు 1001 రోజుల జైలు
మహిళలు కారు నడుపడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని పోరాడిన హక్కుల కార్యకర్త లూజైన్ అల్-హాత్లౌల్ 1001 రోజులు జైలు శిక్ష అనుభవించారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద 2018 మే 31న లూజైన్ను అరెస్టు చేసి ఆరేండ్ల జైలు శిక్ష విధించారు. ఆమెతో మరికొందరినీ అరెస్టు చేశారు. అయితే, లౌజైన్ విడుదల కోసం అప్పట్నుంచి ఆమె కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమెరికా సౌదీపై ఒత్తిడి పెంచింది. మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి ఎక్కువైంది. అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కారు ఎట్టకేలకు ఆమెను విడుదల చేసింది. లేకపోతే ఈ శిక్ష మరికొంతకాలం కొనసాగేదే.













