అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత్త
అంతర్జాతీయ ప్రయాణాలపై రెండు వారాలుగా అమల్లో ఉన్న ఆంక్షలను సౌదీ అరేబియా ఎత్తివేసింది. వైమానిక, జల, భూ మార్గాల ద్వారా తమ దేశంలో ప్రవేశాలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. బ్రిటన్లో వెలుగుచూసి పలు ఇతర దేశాల్లో కూడా బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం.. ఆ దేశం రాకపోకలపై ఆంక్షలు విధించింది. తమ దేశంలో అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణ ప్రారంభమయిందని అంతరంగిక వ్యవహారాల శాఖ ప్రకటించింది.
కొత్త కరోనా జాడలు ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సదరు దేశాల నుంచి వచ్చిన సౌదీ పౌరులు రెండు సార్లు కొవిడ్ పరీక్షలను చేయించుకోవటంతో పాటు 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని స్థానిక అధికారులు వివరించారు. ఇక సౌదీ పౌరులు కానివారికి ఒకసారి కరోనా పరీక్ష, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని అధికారిక ప్రకటనలో సూచించింది.













