ఇజ్రాయెల్ కు ఊహించని షాక్.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అరబ్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు సౌదీ బ్రేక్ వేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం. అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 1979లో ఇజ్రాయెల్ ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇదే సమయంలో యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఇందుకు అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలిచింది.
తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది. తాజా యుద్ధంతో అమెరికా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదనే ఆలోచన సౌదీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.













