హజ్ యాత్రికులకు ఈసారి ఇదే ప్రధాన కండిషన్ !
హజ్ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే వారికి కొవిడ్-19 టీకా తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ సారి యాత్రకు అవకాశం ఇస్తామని సౌదీ సృష్టం చేసింది. ఈ మేరకు సౌదీ అరోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఉంటుంది. హజ్ యాత్రికులకు ఈసారి ఇదే ప్రధాన కండిషన్ కూడా అని హెల్త్ మినిస్ట్రీ తన ప్రకటనలో పేర్కొంది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తవ్ఫిక్ అల్ రబియా సంతకం చేసిన ఈ సర్క్యూలర్‌ను సంబంధిత అధికారులు మీడియాకు అందించారు. అయితే, ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ ఎంత మంది యాత్రికులను అనుమతి ఇవ్వనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక గతేడాది కరోనా కారణంగా విదేశీ యాత్రికులను నిషేధించిన విషయం తెలిసిందే.













