విద్వేష దాడులను ఖండించిన సత్య నాదెళ్ల
అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఖండించారు. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు అమెరికాలో సుమారు మూడు వేల విద్వేష దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆసియన్ అమెరికన్ అడ్వకసీ గ్రూప్ పేర్కొన్నది. 2019లో ఆ సంఖ్య కేవలం 216 మాత్రమే ఉన్నట్లు ఎఫ్బీఐ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో నమోదు అవుతున్న విద్వేష ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని సత్యా నాదెళ్ల తన ట్వీట్లో పేర్కొన్నారు. వర్ణవివక్ష, ద్వేషం, హింసకు ఈ సమాజంలో చోటులేదని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆసియన్లు, ఆసియా అమెరికన్ల సమాజానికి అండగా నిలుస్తున్నట్లు సత్యా నాదెళ్ల పేర్కొన్నారు.













