యూఎస్ ఓపెన్ టోర్నీకి సానియా మీర్జా దూరం
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయంతో ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగింది. రెండు వారాల క్రితం కెనడాలో జరిగిన టొరంటో ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో పాల్గొన్న ఆమె మోచేతికి గాయమైంది. కెనడా టోర్నీ సందర్భంగా నా మోచేతికి గాయమైంది. దీని తీవ్రత అప్పుడు గుర్తించలేదు. కానీ నొప్పివళ్ల స్కానింగ్ చేయించుకోగా, స్వల్ప పగులు వచ్చినట్లు తేలింది. దీంతో యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. దీంతో ఈ ఏడాదే రిటైర్మెంట్ కావాలనుకున్న ఈ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశముంది.













