సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. 50వ పడిలో అడుగుపెట్టిన అతడికి ఆస్ట్రేలియా క్రికెట్ గొప్ప బహుమతి ఇచ్చింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోని ఒక గేటుకు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టింది. ఈ గౌరవం అందుకున్న ఆస్ట్రేలియన్ కాని తొలి క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ రికార్డు సృష్టించాడు. సచిన్‌తో పాటు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరుకు కూడా ఆ గేటుకు పెట్టింది. ఈ గౌరవం పట్ల క్రికెట్ గాడ్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ తర్వా సిడ్నీ నా ఫేవరెట్ గ్రౌండ్. 1991-92లో ఆస్ట్రేలియాలో నా మొదటి పర్యటనతో మొదలు నాకు అక్కడ ఎన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. నాతో పాటు నా మంచి స్నేహితుడు లారా పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం కల్పించినందుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, ఆస్ట్రేలియా క్రికెట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూన్నా. త్వరలో సిడ్నీని సందర్శిస్తాను అని సచిన్ తెలిపాడు.













