రిషి సునాక్ కు ప్రత్యేక బహుమతి అందించిన కేంద్ర విదేశాంగ మంత్రి
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ను కలిశారు. జైశంకర్ తన భార్య కోక్యోతో కలిసి యూకే ప్రధానమంత్రి అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. జైశంకర్ దంపతులకు సునాక్ దంపతులు సాదర స్వాగతం పలికారు. సునాక్‌కు భారత ప్రధాని మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అందించారు. దాంతో పాటు భారత స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను కూడా సునాక్‌కు బహుమతిగా ఇచ్చారు.













