అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే… రువాండాకు తరలిస్తాం
దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారిపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ హెచ్చరించారు. అక్రమ మార్గాల ద్వారా చొరబడే వారిని శరణార్థిగా పరిగణించేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. బోట్ల ద్వారా ఆక్రమంగా దేశంలోని ప్రవేశిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ కొత్తగా తీసుకువచ్చిన విధానానికి రిషి మీడియాకు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే.. ఇక మీరు శరణార్థిగా ఆశ్రయం పోందలేరు. ఆధునిక బానిసత్వం రక్షణ ప్రయోజనాలను కూడా అందుకోలేరు. నకిలీ మానవ హక్కుల దావాలు కూడా వేయలేరు. మొత్తానికి ఇక్కడ ఉండలేరు అని వెల్లడించారు. అక్రమంగా వచ్చిన వారిని నిర్బంధించి, కొన్ని వారాల్లోనే వారిని సొంతం దేశానికి పంపిస్తాం. లేదా అటువంటి వారిని రువాండా వంటి ఇతర దేశాలకు తరలిస్తాం. ఒకసారి ఇలా వెనక్కి పంపినవారిని అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా తిరిగి బ్రిటన్లోకి అడుగుపెట్టకుండా నిషేధిస్తాం అని రిషి స్పష్టం చేశారు.













