నల్లసముద్రంపై ఆధిపత్యమే లక్ష్యం
ఉక్రెయిన్ తూర్పు భాగంపై ఇప్పటికే పట్టుబిగించిన రష్యా, దక్షిణ భాగంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా నల్లసముద్రం తీరంలోని నగరాల నుంచి ఉక్రెయిన్ను దూరం చేయాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నౌక నిర్మాణ కేంద్రమైన మికలైవ్ నగరంపై దాడుల మోతాదును పెంచింది. గతంలో ఈ నగరంపై దాడి ప్రయత్నాలను ఉక్రెయిన్ దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఇప్పుడు మికలైవ్తో పాటు మరో కీలక ప్రాంతమైన ఒడెసాపై రష్యా దృష్టి సారించింది. ఈ రెండు నగరాలు పుతిన్సేన స్వాధీనమైతే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడే అవకాశం ఉంది.













