రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెలలో భారత్‌కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో పుతిన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా డిసెంబర్ 6న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత రష్యా అధ్యక్షుడికి ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం. ఇంతకుమందు ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జెనీవాలో సమావేశమయ్యారు. అనంతరం ఇటలీలో జరిగిన జీ 20 సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు.













