భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత పర్యటనకు రానున్నారా? అంటే ఆ అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ లో సెప్టెంబరులో జరిగే జీ-20 సదస్సుకు పుతిన్ హాజరవుతారా? అని అడిగిన ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ దాన్ని కొట్టి పారేయలేం. జీ-20 సమావేశాల్లో రష్యా పూర్తిస్థాయిలో హాజరవుతూనే ఉంది. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుంది. అయితే పుతిన్ పాల్గొనడంపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని వెల్లడించారు. దీంతో పుతిన్ భారత్కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది.













