పశ్చిమ దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన రష్యా
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా మరోసారి పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. మూడో ప్రపంచం యుద్ధం వస్తే అది అణు యుద్ధమే అవుతుందని మళ్లీ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆంక్షలతోనే మూడవ ప్రపంచ యుద్దానికి దిగుతామన్న బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ మూడవ ప్రపంచ యుద్ధం కేవలం అణు యుద్ధమే అవుతుందని అన్నారు. అణు యుద్ధం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని, ఆ ఆలోచన పశ్చిమ దేశాల నేతల్లోనే ఉందని, రష్యా ప్రజల మనోభావాల్లో ఆ ఉద్దేశం లేదని అన్నారు. అమెరికా ఓ నెపోలియన్, హిట్లర్ తరహాలో ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు.













