రష్యా-అమెరికా సంబంధాల్లో మరో కీలక పరిణామం
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఉప్పు-నిప్పుగా ఉన్న రష్యా, అమెరికా సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్లసముద్రంపై ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానం ఢీకొట్టింది. దీంతో డ్రోన్ ప్రొపెల్లర్ ధ్వంసమైంది. ఈ పరిస్థితుల్లో తమ డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. నల్లసముద్రంలో అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్-27 యుద్ధ విమానాలు ప్రమాదకరంగా తగనిరీతిలో అడ్డుకున్నాయి. అందులో ఓ యుద్ధవిమానం మా డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టింది. అంతకు ముందు ఎంక్యూ`9 డ్రోన్ ముందు సుఖోయ్‌లు పలుమార్లు ఇంధనాన్ని కుమ్మరించాయి అని అమెరికాకు చెందిన యూరోపియన్ కమాండ్ ఓ ప్రకటనలో వివరించింది. ఈ ఘటనపై రష్యాకు అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కగా అమెరికా డ్రోన్ అత్యంత ప్రమాదకరంగా చక్కర్లు కొడుతూ వచ్చిందని, మా విమానాన్ని తాకి కూలిపోయిందని రష్యా ప్రకటించింది.













