ఉక్రేనియన్ లకు రష్యా పౌరసత్వం
ఉక్రెయిన్‌లో ఐదో వంతు ఇప్పటికే తమ ఆధీనంలోకి వచ్చిందని రష్యా తాజాగా ప్రకటించింది. డోన్బాస్తో పాటు ఖెర్సన్, ఇపోరిజియా ప్రాంతాల్లో కూడా జూలై లోపే రిఫరెండం నిర్వహించే యోచన ఉన్నట్టు ఉక్రెయిన్‌తో చర్చల్లో పాల్గొన్న రష్యా బృందం సభ్యుడు లియోనిడ్ స్లట్స్కీ వెల్లడించారు. మెలిటోపోల్ వంటి నగరాల్లో రషా పౌరసత్వం కోసం పౌరుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటున్నారు కూడా. మారియుపోల్ వంటి రష్యా ఆక్రమిత నగరాల్లో పలువురు పౌరులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తుండటం విశేషం. రష్యా పౌరునిగా మారాలన్నది నా చిన్నప్పటికీ కల. ఇప్పుడు ఇంటి నుంచి అడుగు కూడా కదల్చకుండానే అది నెరవేరేలా కన్పిస్తోంది అని ఓ మారియుపోల్వాసి తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితి అంతటా లేదు.













