ఉక్రెయిన్ ప్రతిదాడి.. ఒక్కరోజే 1000 మంది
తమ భూభాగాలపై మళ్లీ బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో రష్యా భారీ మొత్తంలో సైన్యాన్ని నష్టపోయిందని ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు వెల్లడిరచాయి. కీవ్ దాడుల్లో ఒక్క రోజే కనీసం 1000 మంది క్రెమ్లిన్ సైనికులు మృతి చెందినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక సైనిక చర్యలో ఇప్పటి వరకు 71 వేల మందికి పైగా సైనికులను నష్టపోయినట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజా మరణాలపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.













