బాంబుల మోతలే మంగళవాయిద్యాలు..క్షిపణుల దాడులే ఆశీర్వాదాలు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతుంది. బాంబుల వర్షం కురుస్తోంది. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్యే పెళ్లి ప్రమాణాలతో ఓ జంట ఒక్కటైంది. అంతా బాగుంటే అరంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావిచారు. కానీ యుద్ధం ప్రారంభమైన రోజే పెళ్లి చేసుకోవాలని జంట నిర్ణయించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రశాంతమైన నది పక్క, అందమైన లైట్లతో రెస్టారెంట్ టెర్రస్‌పై ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రష్యాలోని వాల్డై హిల్స్‌లో 21 ఏళ్ల యారీనా అరివా, ఆమె భాగస్వామి స్వ్యటో స్లావ్ ఫర్సిన్ వివాహం చేసుకోవాలని భావించారు. రింగులు మార్చుకుని జంట ఒక్కటైంది. యువతీ అరీవా, కీవ్ లోని సిటీ కౌన్సిల్లో డిప్యూటీగా పని చేస్తుంది.













