స్వదేశానికి 490 మంది విద్యార్థుల రాక : కేంద్రం
ఉక్రెయిన్ నుంచి 490 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్, రొమానియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన రెండు రెయిర్ ఇండియా విమానాల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. బుకారెస్ట్ నుంచి బయలుదేరిన ఎఐ 1942 విమానంలో 250 మంది ఉన్నారు. ఈ విమానం ఆదివారం తెల్లవారుజామున 2:24 గంటలకు చేరుకుంది. బుడాపెస్ట్‌లో బయలుదేరిన ఎఐ 1940 విమానంలో 240 మంది ఉన్నారు. ఈ విమానం ఆదివారం ఉదయం 9:20 గంటలకు ఢల్లీి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి శనివారం మంబయికి 219 మందితో తొలి విమానం వచ్చిన సంగతి తెలిసిందే. వారిత కలిపి మొత్తంగా 709 మంది మన దేశం చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరులందర్నీ సాధ్యమైనంత త్వరగా తీసుకొస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.













