క్వారంటైన్ లోకి రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తన సన్నిహితులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ ఇప్పటికే స్పుత్నిక్`వీ టీకా రెండు డోసులు తీసుకున్నారు. పుతిన్ ఆరోగ్యంతో ఉన్నారని ప్రభుత్వ అధికారి ప్రతినిధి మిట్రీ పెస్కోవ్ తెలిపారు. క్వారంటైనలో ఉన్నాగానీ అధికారిక కార్యకలాపాలు అన్నీ చేస్తారని తెలిపారు. పుతిన్ కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని తొలుత ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. పుతిన్ కరోనా పరీక్ష చేయించుకున్నారని, ఆరోగ్యంతో ఉన్నారని మాత్రమే వెల్లడిరచింది.













