రష్యా సైన్యం కీలక ప్రకటన.. సొలెడార్ పట్టణాన్ని
ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా కీలక ముందడుగు వేసింది. ఆ దేశానికి చెందిన ప్రైవేటు సైన్యం వాగ్నార్ సంస్థ ఉక్రెయిన్లోని ఉప్పు గనుల పట్టణం సొలెడార్ను ఆక్రమించుకొంది. ఈ విషయాన్ని వాగ్నార్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. దీనికోసం భీకర పోరాటం జరిగినట్లు తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పోరు జరుగుతోందన్నారు. అక్కడ బందీల విషయాన్ని కూడా వెల్లడిస్తామని చెప్పారు. వాగ్నార్ సభ్యులతో ఉన్న ఒక ఫొటోను ప్రిగోజిన్ విడుదల చేశారు. కేవలం తమ యూనిట్లే ఈ నగరాన్ని ఆక్రమించాయని పేర్నొన్నారు.













