ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కీలక మౌలిక సదుపాయాలు, నివాస భవనాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. కీవ్‌తో పాటు ఉక్రెయిన్‌లో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్, నల్ల సముద్రం తీరంలోని నౌకా నగరం ఒడెసా, పాల్తొవా, లవీవ్, జపోరిజియా, నిప్రో తదితర నగరాలను మాస్కో లక్ష్యం చేసుకుంది. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసింది. 81 క్షిపణులను 8 షాహిద్ డ్రోన్లను రష్యా ప్రయోగించిందని, అందులో 34 క్షిపణులను తాము కూల్చామని కీవ్ రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. వరుస క్షిపణి దాడులు జపోరీజియా అణు విద్యుత్కేంద్రానికీ తీవ్ర నష్టం కలిగించాయి. కేంద్రానికి విద్యుత్ అందిస్తున్న ఏకైక 750 కిలోవాట్ల లైన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కొంతసేపు డీజీల్ జనరేటర్లతోనే అణు రియాక్టర్లను నడిపారు.













