కీవ్ పై విరుచుకుపడిన రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన దాడులను ఉక్రెయిన్ సమర్ధంగా నిలువరించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 18 క్షిపణులను కూల్చివేశాయని ఆ దేశ అధికారులు వెల్లడిరచారు. ఇందుకు పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ దాడుల కారణంగా ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదని వివరించారు. ఐరోపా దేశాల నేతలు రష్యాను మరింతగా శిక్షించాలని ఒకవైపు భావిస్తుండగా, మరోవైపు చైనా రాయబారి శాంతి ప్రతిపాదన చేస్తున్న తరుణంలో రష్యా భీకర దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కీవ్‌పై రష్యా ఇలా దాడులకు దిగడం ఈ నెలలో ఇది ఎనిమిదవసారి.













