అణ్వస్త్ర ఒప్పందానికి రష్యా చెల్లుచీటీ
అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందానికి గతంలో తెలిపిన సమ్మతిని రద్దు చేయడానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీన్ని ఎగువ సభకు పంపుతారు. తాము కూడా రద్దుకే ఓటు వేస్తామని ఎగువ సభ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. 1996లో కుదిరిన ఈ ఒప్పందాన్ని చైనా, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్ పార్లమెంటులు ఇంతవరకు ఆమోదించలేదు. 2000 సంవత్సరంలో రష్యా మాత్రం ఒప్పందంపై సంతకం చేసి పార్లమెంటులో ధ్రువీకరింపజేసినా, అమెరికా సంతకం చేసి కూడా అలా ధ్రువీకరించలేదు. ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాలు ఆయుధ, ధన సహాయం కొనసాగిస్త్తున్నందుకు ప్రతిగా రష్యా ఈ తాజా చర్య తీసుకుంది.













