రష్యా పరిస్థితి దారుణం. మరో చెత్త రికార్డు సొంతం
ఉక్రెయిన్పై దురాక్రమణ తర్వాత రష్యా మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా జాబితాకెక్కింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా వాటిని ఇప్పుడు దాటేసింది. ఉక్రెయిన్పై దాడికి దిగిన పదిరోజుల్లోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో చేరిపోయింది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బేఖాతరు చేయడంతో ఏకైక ఆయుధమైన ఆంక్షల ఆస్రాన్ని బయటకు తీశాయి. ఉక్రెయిన్పై రష్యా ఆయుధాలతో విరుచుకుపడుతుంటే, ఇతర దేశాలన్నీ రష్యాపై ఆంక్షల దాడిని తీవ్రతరం చేశాయి.













