మరోసారి భారత్‌కు మద్దతుగా నిలిచిన రష్యా
భారత్‌కు చిరకాల మిత్ర దేశం రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి (యుఎన్) భద్రతా మండలి (ఎస్సి)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై రష్యా తన మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. బారత్‌తో పాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన సూచించారు. భద్రతా మండలిలో తీసుకురావలసిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసమరని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని లావ్రోవ్ వివరించారు.













