ఉక్రెయిన్ కీలక విజయం!
రష్యా బలగాలపై ఉక్రెయిన్ సేనలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కీవ్ ప్రావిన్స్‌లోని కీలకమైన ఇజియం నగరం నుంచి రష్యా బలగాలు వెనుదిరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో రాజధాని కీవ్‌ను చేజిక్కించుకునేందుకు రష్యా చేసిన ప్రయత్నాలు తిప్పికొట్టిన ఉక్రెయిన్ బలగాలు.. తాజాగా ఖార్కీవ్ నుంచి రష్యా సేనలను వెనుదిరిగేలా చేయడం ద్వారా కీలక విజయం సాధించాయి. అయితే డొనెట్స్క్పై దృష్టి సారించేందుకే ఇజియం నుంచి వెనక్కు మళ్లినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడిరచింది. కాగా ఇజియం నగరాన్ని రష్యా వీడిచిపెట్టడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్స్కీ హర్షం వ్యక్తం చేశారు.













