అమెరికాలో ప్రమాదం.. మంచిర్యాల వాసి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పెండ్యాల వంశీ కృష్ణ (36) మృతి చెందారు. జిల్లా కేంర్రలోని రెడ్డికాలనీకి చెందిన పెండ్యాల సుబ్రహ్మణ్యం జ్యోతిల కుమారుడు వంశీ కృష్ణ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడి ఆరిజోనా రాష్ట్రం ఫినిక్స్‌లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో వంశీ కృష్ణ మృతి చెందాడు ఈ మేరకు అతను పని చేస్తున్న కంపెనీ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తమ కుమారుని మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తెప్పించాని అధికారులు, ప్రజాప్రతినిధులను మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.













