దీనిని అరికట్టడానికి చట్టాలను మార్చాలి : రిషి సునాక్
ఐరోపాను ముంచెత్తుతున్న అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాతో ఇప్పటికే నిండిపోయి ఉన్న ఈ ప్రాంతానికి వలసలు ఆందోళనకరమేనని వ్యాఖ్యానించారు. దీనిని అరికట్టడానికి అంతర్జాతీయ చట్టాలను సవరించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఇటలీలో రైట్ వింగ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ రోమ్‌లో ఏర్పాటు చేసిన అట్రెజు రాజకీయ ఫెస్టివల్లో ప్రసంగించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శత్రువులు వలసలను ఒక ఆయుధంగా మార్చుకునే అవకాశముందని, ఎవరూ అడ్డుకోకపోతే ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. అది ఐరోపా సమాజాన్ని అస్థిర పరుస్తుందని స్పష్టం చేశారు. సముద్రంలో బోట్లలో వారికి ఎక్కించడం ద్వారా ప్రమాదంలో పడేస్తున్నారని, మానవత్వాన్ని కాలరాస్తున్నారని పేర్కొన్నారు.













