భారతీయ సంస్కృతిని చాటిన రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ తన భారతీయ మూలాలను మరొక సారి చాటుకున్నారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఆయన లండన్లో గోపూజ చేశారు. దీనికి బ్రిటన్లోని భారతీయుల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. గోవుకు పూజ చేసి హారతి ఇవ్వడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇటీవలే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఫొటోలను కూడా రిషి సునాక్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం విదితమే. బ్రిటన్లో ఉంటున్నా, ఆ దేశ ప్రధానికి పోటీ పడుతున్నా హిందూ సంప్రదాయాలు, పండుగల నిర్వహణలో రిషి ఎప్పడూ ముందు ఉంటారు. ఆ ప్రభావం తన భవిష్యత్తుపై చూపుతుందేమోనని కూడా ఆయన ఏ మంత్రం సంకోచించరు. నిరుడు దీపావళి సందర్భంగా రిషి తన ఇంటి ముందు దీపాలను పెట్టి మరీ వేడుక చేసుకున్నారు.













