తుదిపోరులో అండర్ డాగ్ గా బరిలోకి : రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని రేసులో ఇప్పటిదాక దూసుకుపోయిన భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్ అనూహ్యంగా వెనుకబడ్డారు. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుడిపోరులో నిలిచిన రిషికీ ఆ పార్టీల సభ్యుల నుంచి మాత్రం ఆశించినమేర మద్దతు లభించటం లేదని సమాచారం. ఈ విషయాన్ని రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు. తాజాగా బ్రిటన్‌లోని గ్రాంథాం నగరంలో ప్రసంగించిన సునాక్ తాను వెనుక బడి ఉన్నాననడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారన్నారు. పార్టీ సభ్యులో కొందరు మాత్రం ప్రత్యామ్నాయం కోరుకొంటున్నారని, వారు తన మాట వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తుదిపోరులో అండర్ డాగ్ గా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.













