అమెరికాలో అతిపెద్ద రైతు.. ఎవరో తెలుసా?

అమెరికాలో అతిపెద్ద రైతు ఎవరో తెలుసా? బిల్‍గేట్స్. అవును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‍గేట్స్ అమెరికాలో అతిపెద్ద రైతు. బిల్‍గేట్స్ తన భార్య మెలిండా ( ఇంకా విడాకులు చట్టబద్ధంగా మంజూరు కాలేదు) పేర ఉన్న వ్యవసాయ భూమి అక్షరాల రెండు లక్షల ఆరవై తొమ్మిది వేల ఎకరాలు. గడిచిన పదేండ్లలోనే ఈ 2,69,000 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ భూములు అమెరికాలోని 18 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఉత్తర లూసియానాలో 70 వేలు, వాషింగ్టన్‍లో 14 వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులో సోయాబీన్, ఆలుగడ్డలు పండిస్తున్నారు.