డొనాల్డ్ ట్రంప్ నిబంధనకు.. బైడెన్ సర్కార్ గుడ్ బై

భారతీయ ఐటీ కంపెనీలు, వృత్తి నిపుణులకు ఉపశమనం కలిగిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ప్రవేశపెట్టిన హెచ్-1బీ వీసా అర్హత ప్రత్యేక నైపుణ్యం నిర్వచనాన్ని కుదింపు నిబంధనను బైడెన్ ప్రభుత్వం తొలగించింది. దీంతో వృతికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యం నిబంధన అడ్డంకులు తొలగిపోనున్నాయి. టెక్నికల్ ఫరంగా చెప్పాలంటే సైద్దాంతిక, ఆచరణాత్మకత అనుభవం (ప్రాక్టికల్ నాలెడ్జ్) అవసరమైన ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యం, బ్యాచిలర్ డిగ్రీ లేదా దానిని సమాన విద్య కనీస అర్హతలుగా ఉంటాయి. ఈ అర్హతలు ఉన్నవారు అమెరికాలో ఉద్యోగంలో చేసేందుకు అర్హులుగా హెచ్ -1బీ వీసా పొందొచ్చు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వీసా పోగ్రామ్స్ కు సంబంధించిన మరో నిబంధనను బైడెన్ సర్కార్ తొలగించినట్టయింది.
అమెరికా కంపెనీలు, భారతీయ అనుబంధ అమెరికా కంపెనీలు విదేశీయులను సులభంగా నియమించుకునే వెసులుబాటు కలిగింది. కాగా అమెరికా ఏడాదికి 85 వేల హెచ్ 1బీ వీసాలను జారీ చేస్తుంది. ఫేస్‍బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తో పాటు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ కంపెనీల యూఎస్ అనుబంధ కంపెనీలు 70 శాతంపైగా నియమించుకుంటున్నాయి.