సోడియం తగ్గిస్తే…మధుమేహానికి చెక్!

ఉప్పులోని సోడియంను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు సుసాన్ సీ వెల్లర్, బెంజ్‍మిన్ ఎన్ విక్కర్స్ తెలిపారు. దీనిని అదపులో ఉంచేందుకు మూడు ఆహార నియమాలను ప్రతిపాదించారు. క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం, సోడియం కలిగిన పదార్థాలను తక్కువ తీసుకోవడంతో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చన్నారు.